మిత్రమా ! ఎందుకు బాధపడుతున్నావు ! అయిందేదొ అయింది। పోయిందేదొ పోయింది.
ఈ లోకానికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో వచ్చావు ! పోయేటప్పుడు లగేజితో పొవాలనుకుంటున్నావు ! అందుకే నీకి ఆరాటం, అశాంతి।
నీవేమి పోగొట్టుకున్నావని విచారిస్తున్నావ్ ? నీవేమి తెచ్చావని నీవు పోగొట్టుకుంటావ్ ? నీవేమి సృష్టించావని నీకు నష్టం వచ్చింది ? నీవు ఏదైతే పొందావో అది ఇక్కడి నుండే పొందావు. ఈనాడు సొంతము అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం కాదా ? రేపు మరియొకరి సొంతమ్ కాగలదు। కావున జరిగేదెదో జరుగక మానదు. అనవసరంగా ఆందొళన పడకు.
ఆందొళన అనారోగ్యానికి మూలం. ప్రయత్నలొపం లేకుండా ప్రయత్నించు. ఫలితం ఏదైన దైవ ప్రసాదంగ స్వీకరించు.
కారు లేదని చింత వద్దు - కాలు ఉన్నందుకు సంతొషించు।
కొట్లు లేవని చింత వద్దు - కూటికి ఉంది కదా సంతోషించు.
కాలిలో ముల్లు గుచ్చుకున్నదని చింతించవద్డు - కంటిలో గుచ్చుకోలేదని సంతోషించు.
కాలం విలువైనది. రేపు అనుదానికి రూపు లేదు. మంచి పనులు వాయిదా వేయకు.
అసూయను రూపు మాపు- అహంకారాన్ని అణగదొక్కు।
హింసను విడనాడు - అహింసను పాటించు।
ఉపకారం చేయలెక పొయినా పరవాలేదు కాని అపకారం తలపెట్టకు.
మతిని శుద్దం చేసేది మతం మానవత్వం లేని మతం మతం కాదు.
దేవుని పూజించు ప్రాణికోటికి సహకరించు తద్వారా భగవదాశిర్వాదంతో శాంతి నీ వెంట చెంత ఇంట ఉండగలదు.
Friday, November 9, 2007
Subscribe to:
Posts (Atom)